ప్రతి కాలనీ సమగ్ర అభివృద్ధి మా ధ్యేయం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 

అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సన్ వే ఓపస్, ప్రైడ్ పార్కు కాలనీలో 5 కోట్ల 20 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని ప్రతి కాలనీని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్కు కాలనీ, సన్ వే ఓపస్ కాలనీలలో ఐదు కోట్ల […]

Continue Reading

గణితశాస్త్రంలో నరేందర్ సత్వాయికి పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి నరేందర్ సత్వాయి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘పారగమ్య సంకుచిత నాళికలలో నాన్-న్యూటోనియన్ ద్రవ ప్రవాహాల గణిత పరిశీలన’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కె. మారుతీ ప్రసాద్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని […]

Continue Reading

సిగాచీ బాధితులకు పూర్తి నష్టపరిహారం వెంటనే చెల్లించాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

సీఎం రేవంత్ రెడ్డి సిగాచీ బాధితులకు ఇచ్చిన కోటి రూపాయలు హామీ నెరవేర్చరా..?? పాశమైలారం పారిశ్రామిక వాడలోని బిపిఎల్ చౌరస్త వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సిగాచీ బాధిత కుటుంబాలతో ర్యాలీ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సీఎం రేవంత్ రెడ్డి సిగాచీ బాధితులకు ఇచ్చిన కోటి రూపాయలు హామీ నెరవేర్చరా..?? అని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. సిగాచీ ప్రమాద బాధితులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని […]

Continue Reading

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో ది మాస్టర్ మైండ్స్ స్కూల్ నూతన బ్రాంచ్ ను స్కూల్ చైర్మన్ రాజు సంఘాని, ప్రిన్సిపాల్ నాగరాజు లతో కలిసి ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. విద్యార్థులకు అన్ని రకాల నాణ్యమైన విద్యను స్కూల్ యాజమాన్యం […]

Continue Reading

సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాద బాధితులకు పూర్తి న్యాయం చేయాలి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి మెట్టు శ్రీధర్ విజ్ఞప్తి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: 2025 జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన ఘోర పారిశ్రామిక ప్రమాదానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా, బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి వినతిపత్రం సమర్పించినట్లు నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు, యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ తెలిపారు.మరణించిన […]

Continue Reading

సిద్ధార్థ నగర్ కాలని సంక్షేమ సంఘం ఎన్నికలు

గౌరవ సలహాదారుగా చుక్కా రాములు గౌరవ అధ్యక్షులుగా పాండు రంగా రెడ్డి అధ్యక్షులుగా ఉపేందర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్ చెరు సర్కిల్ ముత్తంగి డివిజన్ కార్దనూర్ లోని సిద్ధార్థ నగర్ కాలనీలో ఆదివారం అధ్యక్షులు మనోహర్ అధ్యక్షత జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగాయి. కాలనీ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా కాలనీ గౌరవాధ్యక్షులు పాండురంగారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రెటరీ […]

Continue Reading

కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లినట్లే.. పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి..

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. ఆదివారం సాయంత్రం పటాన్‌చెరు మండలం భానూరు గ్రామంలో ఇటీవల బిఆర్ఎస్ పార్టీలో చేరిన గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు ప్రవళిక నరేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరచితలో స్వర్గం […]

Continue Reading

యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఘన విజయం

మనవార్తలు ప్రతినిధి , మియాపూర్: సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ప్రజా షెల్టర్స్ కమిటీ హాల్, మియాపూర్లో మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది.సామాజిక సేవ పట్ల అంకితభావంతో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తున్న యలమంచి ఉదయ్ కిరణ్, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ […]

Continue Reading

బిఆర్ఎస్ లో చేరిన భానూరు కాంగ్రెస్ కీలక నాయకులు, వార్డు సభ్యురాలు..

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు హరీష్ రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ విధానాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ లో చేరుతున్నారని పటాన్‌చెరు […]

Continue Reading

నిండు జీవితానికి రెండు చుక్కలు

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి విధిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. […]

Continue Reading