కార్మికుల హక్కులను కాలరాస్తున్న బిస్లరీ యజమాన్యం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్

politics Telangana

కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న బిస్లరి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

కార్మికుల అక్రమ తొలగింపులపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి విన్నవించిన సిఐటియు నాయకులు

సానుకూలంగా స్పందించిన మంత్రి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: 

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికుల హక్కులను కాల రాస్తున్న బిస్లరీ యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ ప్రభుత్వంను డిమాండ్ చేశారు.బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో సిఐటియు నాయకత్వ బృందం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్, జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, జిల్లా ఉధ్యక్షులు అతిమేల మానిక్, జిల్లా కార్యదర్శి జి సాయిలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ‌ బిస్లరి ఇంటర్నేషనల్ యాజమాన్యం చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. యూనియన్ పెట్టుకుంటే తొలగిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లేబర్ కోడ్స్ అమల్లోకి రాకముందే యాజమాన్యాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్ రాష్ట్ర లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్ కు ఫోన్ చేసి బిస్లరి కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.కార్మిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిస్లరీ యూనియన్ జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *