మన వార్తలు, శేరిలింగంపల్లి :
హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో, మసీద్‌బండ బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి కాంటెస్టేడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సంఘ నాయకులు, బీజేపీ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రవి కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కేక్ కట్ చేసి సంబరాలు జరుపగా, నాయకులు పూలమాలలు వేసి ఆయనను సన్మానించారు.కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ రవి కుమార్ యాదవ్ పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న అంకితభావం కలిగిన నాయకుడని కొనియాడారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బోయిని అనూష మహేష్ యాదవ్ మాట్లాడుతూ, బీజేపీ పార్టీ బలోపేతానికి రవి కుమార్ యాదవ్ సేవలు అమూల్యమని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళా నాయకులు, యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
