గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి 

politics Telangana

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయండి

పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్‌చెరు, గుమ్మడిదల మండల పరిధిలోగల గ్రామాలలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.సోమవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్‌చెరు, గుమ్మడిదల మండలాల పరిధిలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, పిఆర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు కేటాయిస్తామని తెలిపారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలను తన దృష్టికి తీసుకొని వస్తే  పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

నందిగామ గ్రామపంచాయతీ పరిధిలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తే. రాబోయే పది రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. దీని ద్వారా ప్రతినెల గ్రామపంచాయతీకి ఆదాయం లభిస్తుందని తెలిపారు.భానూరు, క్యాసారం, నందిగామ గ్రామపంచాయతీల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆదేశించారు.గుమ్మడిదల మండల పరిధిలోని అనంతరం, కానుకుంట, నూతనకల్, కొత్తపల్లి, తదితర గ్రామాల పరిధిలో అంతర్గత రహదారుల నిర్మాణానికి హ్యమ్ ద్వారా నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు డిఈ దీపక్ తెలిపారు. టెండర్లు పూర్తి చేసిన పనులు ప్రారంభించక పోతే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ఎంపీడీవోలు యాదగిరి, ఉమాదేవి, పిఆర్ డిఈ దీపక్, ఎంపీఓ హరిశంకర్ గౌడ్, ఏఈ శశిధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *