మనవార్తలు , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ కు చెందిన ప్రముఖ బిల్డర్, సంఘసేవకుడు, టీఆరెస్ సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు కొడుకు మిరియాల చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల ప్రీతం జన్మదిన వేడుకలు మంగళవారం రోజు అశోక్ నగర్ లోని హోటల్ సితార గ్రాండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ మరియు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీష్ గౌడ్, శ్రీకాంత్, నాన్నే శ్రీనివాస్, రఘునాథ్ రెడ్డి, మెట్టు కుమార్ లు పాల్గొని ప్రీతంకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు ప్రీతం కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు మిర్యాల రాఘవరావు సుగుణ, భార్య యామిని దివ్య, బావ గోపాలకృష్ణ అక్క ప్రణీతలు ఈ వేడుకలో పాల్గొని వారి ఆశీస్సులు అందించారు. సుమారు 600 మంది ఈ వేడుకలకు పాల్గొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు వారిలో ముఖ్యంగా త్రినాధ్, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, మోహన్ గౌడ్, విష్ణు, సుబ్బారావులతో పాటు, అన్ని ప్రాంతాల నుంచి నాయకులు, స్నేహితులు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు.