-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్
-ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం :
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రాపురంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఐలేష్ ఆధ్వర్యంలో బీహెచ్ఈఎల్ బస్ డిపో ఎక్స్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం సమీపంలోని డైమండ్ పాయింట్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి గూడెం యాదమ్మ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఈఎస్ఐ ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్లకు చెందిన కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులు, జీఎంఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
