మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం:
పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీ పురం 268 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్, ఆర్ఆర్కే ఫౌండేషన్ చైర్మన్, ఆర్ఆర్కే ఎంటర్ప్రైజెస్ చైర్మన్ ఆర్కే లక్ష్మి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వారి బాధలు వినేందుకు బస్తీల్లో 110 వ రోజు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు . అనంతరం ఆర్ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్కే లక్ష్మి మాట్లాడుతూ కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్లు, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది. ఆర్ఆర్కే ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం కూడా ఆర్కే లక్ష్మి అందిస్తున్నారు.
