గ్రామంలో వింగ్ ఏర్పాటు చేసుకొని లక్షల్లో అక్రమ వసూళ్లు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న చిన్న కంజర్ల జిపిఓ బండారి రాజును విధుల్లో నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పటాన్ చెరు డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పటాన్ చెరు తహసిల్దార్ హరిబాబు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పటాన్ చెరు మండలంలోని చిన్నకంజర్ల గ్రామంలో సర్వేనెంబర్ 113 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు పేరుతో గ్రామంలోని రైతుల ద్వారా 185 ఎకరాలను తీసుకుంటుందన్నారు. జిల్లా అధికార యంత్రాంగం గ్రామసభ నిర్వహించినప్పుడు రైతులకు 28 లక్షలు ఇస్తున్నట్లుగా ప్రకటించారని, ప్రస్తుతం రెండు దఫాలుగా 75 ఎకరాలు, మరో 50 ఎకరాలకు గ్రామంలోని రైతులకు 28 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించారని చెప్పారు.
జిపిఓ బండారి రాజు గ్రామంలోని ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులతో వింగ్ ఏర్పాటు చేసుకొని వారి ద్వారా లక్షల రూపాయల్లో రైతుల ద్వారా డబ్బులను అక్రమ దందకు తెరలే పాడన్నారు. రికార్డులను పూర్తిగా తార్మారు చేస్తున్నాడని ఆరోపించారు. ప్రతిరోజు మున్సిపల్ వార్డు కార్యాలయం నుంచి తన విధులను నిర్వర్తించవలసి ఉన్న అక్కడి నుంచి తన కార్యకలాపాలను వెంచర్ల లో ఉన్న ఆఫీసుల ద్వారా తన విధులను నిర్వర్తిస్తుంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రజానీకానికి ఎక్కడ అందుబాటులో ఉండకపోవడం దారుణం అన్నారు. 113 సర్వే నెంబర్లో పట్టా సర్టిఫికెట్లు పొందిన వారికి, ఎంజాయ్ మెంట్ పక్కా ఉన్న వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం రాయకుండా రైతులను మోసం చేస్తున్నాడని, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నవాళ్లుకు కూడా పూర్తిస్థాయిలో నష్టపరిహారం రాకుండా అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు.
అనేకమంది రైతుల వద్ద డబ్బులు డైరెక్ట్ గా డిమాండ్ చేస్తు అనేకమంది రైతులు భయాందోళనకు గురై జిపిఓ రాజుకు మధ్యవర్తి ద్వారా లక్షల రూపాయలు ముట్ట చెబుతున్నారని ఆరోపించారు. చిన్నకంజర్ల గ్రామ రైతులను పూర్తిగా నట్టేట ముంచుతున్నాడని విమర్శించారు. జిపిఓపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలియజేశారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న చిన్న కంజర్ల గ్రామ రెవెన్యూ అధికారి పైన పూర్తిస్థాయి విచారణ జరిపించి, వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పోచయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
