మనవార్తలు ప్రతినిధి, రామచంద్రాపురం :
ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి సృజన , భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి తో కలిసి భారతి నగర్ డివిజన్లో పర్యటించారు.మొదటగా బిడిఎల్ కాలనీ వద్ద నిర్మించాల్సిన కాంపౌండ్ వాల్‌తో పాటు రాయసముద్రం చెరువు సమీపంలోని వర్షపు నీటి కాలువను పరిశీలించారు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే కాంపౌండ్ వాల్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి కమిషనర్‌ను కోరారు.అనంతరం డివిజన్ వార్డు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి డివిజన్లో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులపై కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎమ్ ఎమ్ టీఎస్ హాల్ట్ నుంచి విద్యుత్‌నగర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయడం, డివిజన్లో చెత్త సేకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం, అమీన్పూర్ సర్కిల్‌కు ట్రీ ప్రూనింగ్ వాహనం మంజూరు చేయడం, ఓల్డ్ ఎమ్ఐజి కాలనీలో పెండింగ్‌లో ఉన్న స్పోర్ట్స్ ఫైల్‌ను త్వరితగతిన పరిష్కరించచండి అని భారతి నగర్ డివిజన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ ను కోరారు.అనంతరం కమిషనర్ శ్రీమతి సృజన కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక నివాసితులను కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రస్తావించిన ప్రధాన సమస్యలను తదుపరి పర్యటన నాటికి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, స్థానిక ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
