అనుమతులు కొన్ని అంతస్తులకి అదనపు అంతస్తుల భవనాలు లెక్క లేనన్ని

Hyderabad politics Telangana

చోద్యం చూస్తున్న జి హెచ్ ఎం సి అధికారులు

సీజంగ్ పేరుతో ఫిర్యాదు దారులకళ్ళు గప్పి నిర్మాణాలు పూర్తి

మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి 49 సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అనుమతికి మించి అదనపు అంతస్తులు నిర్మిస్తున్న వారు ఇచ్చే ముడుపులు తీసుకొని చేతులు దులుపు కున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. ఇక ఇది తమ పని కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటివి శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోనీ రాఘవేంద్ర కాలని, రాజరాజేశ్వరి కాలని, శ్రీరామ్ నగర్ ఏ.బి.సి బ్లాకులు, గచ్చిబౌలి, అంజయ్య నగర్, రోలింగ్ హిల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రాంతాల్లో.అక్రమ నిర్మాణాల దారులకు అండగా నిలుస్తున్న అధికారుల పై నిఘా ఉండాలని ప్రజలు అంటున్నారు. ఇలాంటి అడ్డదారిలో డబ్బులకు కక్కుర్తి పడి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఇంత బహిరంగంగా నిర్మాణం జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.తాజా మాజీ కార్పొరేటర్ బంధువు, మరికొందరు అనుచరులు అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టినా చర్యలు ఉండవు.ఎందుకంటే మా వెనకాల ప్రజాప్రతినిధి ఉన్నాడనే భరోసా నో లేక అధికారులు ఏమి చేయ లేరు అనే ధీమా తెలియదు కానీ అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు.

మమ్మేల్నెవరు ఆపేది

ఏది చేసినా ? ఎంత చేసినా మమ్మేల్నెవరురా ఆపేది అంటూ ఓ సినిమా పాటను తలపించే విధంగా శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో ఎన్నో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పిర్యాదులు చేసిన ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడంలో ఎన్ని లక్షలరూపాయలు చేతులు మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ లను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేస్తే తప్పా వీరికి అడ్డుకట్ట వేయలేరని సాధారణ ప్రజలు పేర్కొంటున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం లో కింది స్థాయి సిబ్బంది బిల్డర్ లకి లోపల పనులు లేట్ గా చేసుకున్న బయట ప్లాస్టింగ్ పనులు చేసుకుని సున్నలేసుకొండనీ సలహాలు ఇవ్వడం గమనార్హం..

అన్ని ఆటంకాలే

కాలనీల్లో మౌళిక వసతులు అంటే రోడ్లు, డ్రైనేజీ, త్రాగు నీరు పైపులైన్ లు వేయడం కోసం అక్కడ నివసిస్తున్న ప్రజలను అంచనా వేసి పైప్ లైన్లు వేస్తారు. కానీ ఇలా అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టడం వల్ల జనాలు పెరిగిపోవడం తో వేసిన డ్రైనేజీ, త్రాగు నీరు సరిపోవడం లేదు. నిర్మాణ సామాగ్రి ఇసుక, కంకర, సిమెంట్ తీసుకువచ్చిన భారీ వాహనాల వల్ల రోడ్లు పడవుతున్నాయి. దీంతో ప్రజలు ట్రాఫిక్ జామ్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నిత్యం పొంగి పొర్లి తీవ్ర దుర్గంధం వల్ల ప్రజలకి అసౌకర్యంగాను , అనారోగ్యం కి కూడా గురవుతున్నారు.ఇప్పటికైనా అధికారులు చర్యల కి ఉపక్రమించపోతే ఫిర్యాదుదారులు పై అధికారుల దృష్టి కి తీసుకెలతాము అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *