కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యజమాన్యం పై చర్యలు తీసుకోని కార్మిక శాఖ సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

politics Telangana
  • బిస్లరి పరిశ్రమ కార్మికులు చెట్ల కొమ్మలు కట్టుకొని వినూత్నం నిరసన
  • అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
  • ఈనెల 25న చలో బిస్లరీ ఇంటర్నేషనల్ పరిశ్రమ
  • పాల్గొననున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

      మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

బిస్లరి వర్షములో అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లో తీసుకోవాలని కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న బిస్లరి యాజమాన్యంపై కార్మిక శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు అతిమేల మానిక్ తీవ్రంగా ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోసం బిస్లరీ చేస్తున్న సమ్మె 40వ రోజుకు చేరుకుంది. సోమవారం బిస్లరీ యాజమాన్యం మొండి వైఖరి ఆటవిక చర్యలతో కార్మికులు రోడ్నపడాని నిరసిస్తూ చెట్ల కొమ్మలు కట్టుకొని వినూత్నంగా ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా అతిమేల మానిక్ మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా కార్మికులు పరిశ్రమ అభివృద్ధి కోసం శ్రమించారన్నారు. ఒక్క ప్లాంట్ ద్వారా ఎన్నో ప్లాంట్లను ఏర్పాటు చేసి యజమాన్యం వేల కోట్లు గడుస్తుందని విమర్శించారు. కార్మికులు హక్కులు ఉద్యోగ భద్రత కోసం చట్టబద్ధంగా యూనియన్ ఏర్పాటు చేసుకుంటే యాజమాన్యం కక్ష సాధింపులతో ఐదు మంది యూనియన్ నాయకత్వాన్ని అక్రమంగా తొలగించిందని, తొలగించి 9 నెలలైనాన యాజమాన్యం మొండిగా వ్యవరిస్తుందని ఆరోపించారు. గత 40రోజులు కార్మికులు సమ్మె చేస్తున్నారని అన్నారు. చట్టాలు విల్లంగిస్తున్న యాజమాన్యంపై కార్మిక శాఖ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని మంది పడ్డారు. తొలగించిన కార్మికులను వెంటనే విధులోకి తీసుకోవాలని వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు జులై 25వ తేదీన చలో బిస్లరీ (ఐడిఏ పాశమైలారం) కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొంటారన్నారు..ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు, యూనియన్ జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి, నాయకులు నాగరాజు, నవీన్, అజయ్, ప్రవీణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
L

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *