గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారులను అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

కరాటే పోటీలలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారులను పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. ఇటీవల గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన కరాటే పోటీలలో బీరంగూడకు చెందిన క్రేజీ క్రూ కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. అద్భుతమైన ప్రదర్శనలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో చిన్నారులను జిఎంఆర్ అభినందించారు. విద్యార్థి స్థాయి నుండి క్రీడల పై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి రెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మల్లేష్, శివా రెడ్డి, వెంకటేష్, మేరాజ్ ఖాన్, రామచందర్, రామకృష్ణ, అకాడమీ నిర్వాహకులు సంతోష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *