మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే ఆ ఉద్యోగానికి వన్నె తెచ్చిన వారవుతారని పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్
యేపూరి శివానందం పేర్కొన్నారు. పటాన్ చెరు మార్కెట్ యార్డ్ లో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న మహబూబ్ జోగిపేట్ మార్కెట్ యార్డ్ కు బదిలీపై వెళ్లారు. సోమవారం మార్కెట్ యార్డులో జరిగిన సన్మాన సభలో మార్కెట్ కమిటీ చైర్మన్ యేపూరి శివానందం తో పాటు యార్డ్ పాలకవర్గం సభ్యులు, వర్తకుల సంఘం ప్రతినిధులు,వర్తకులు పలువురు ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శివానందం మాట్లాడుతూ పటాన్ చెరు మార్కెట్ యార్డులో కార్యదర్శిగా మహబూబ్ ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. మార్కెట్ యార్డు అభివృద్ధికి చిరునామాగా పటాన్ చెరు మార్కెట్ యార్డు నిలిచిందని, రాబోయే రోజుల్లో మరింతగా యార్డు ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, పాలకవర్గం సభ్యులు వర్తకులు, దుకాణం దారులు తదితరులు పాల్గొన్నారు.
