కాలనీల భద్రత కోసం వీధి దీపాల ఏర్పాటు

politics Telangana

– ప్రత్యేక చొరవ తీసుకున్న ఆంజనేయులు సాగర్

మనవార్తలు ప్రతినిధి ,  – శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ మరియు సిద్ధిక్ నగర్ కాలనీలలో డివిజన్ నాయకుడు ఆంజనేయులు సాగర్ దాదాపు అన్ని ప్రాంతాల్లో వీధి దీపాలను స్వయంగా దగ్గరుండి ఏర్పాటు చేయించారు.ఈ వీధి దీపాల ఏర్పాటు వల్ల రాత్రి సమయంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఎలాంటి భయాందోళనలు లేకుండా సురక్షితంగా సంచరించే అవకాశం కలుగుతోందన్నారు. చీకటి కారణంగా చోటుచేసుకునే అసౌకర్యాలు, ప్రమాదాలు మరియు అవాంఛనీయ ఘటనలను నివారించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు.అంజయ్య నగర్ డివిజన్‌లో కొన్ని ప్రాంతాల్లో వెలుగుల కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించి, ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. కాలనీల్లో భద్రతా వాతావరణం ఏర్పడటంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన పరిస్థితులు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *