కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ బుధవారం పటాన్ చెర పట్టణంలోని జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోలు ఏడుసార్లు పెంచిందని గుర్తు చేశారు 107 రూపాయలు ఉన్న పెట్రోలు 115 రూపాయలకు వెళ్లిందని, పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం వలన రోజువారి నిత్యవసర సరుకుల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉన్నదన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యల వలన సామాన్య మధ్యతరగతి ప్రజానీకం పైన అధిక భారాలు పడే అవకాశం ఉంటుందని వాపోయారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచములు ధరలు భారీగా పెరగడంతో మన దేశంలో ఉన్న పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచవలసి వస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, గతంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పుడు ఎందుకు ధరలను తగ్గించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో నిత్యవసర వస్తువులతో పాటు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో రైతులు, కార్మికులు ఇతర ప్రజానికం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పవలసిన అవసరం లేదన్నారు. ధరలు పెరుగుదల కార్మికుల కుటుంబాల పైన అధిక బారాలు మోపే అవకాశం ఉందన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని, కార్మిక వర్గానికి వేతనాలు 26 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కనీస వేతనాలు పారదర్శకంగా లేవని, అనేక పరిశ్రమల్లో 600 నుంచి 900 రూపాయలు ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 540 రూపాయలను పెంచడంలో అంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. గతంలో కార్మికులకు వస్తున్న డి ఏ ను ఎత్తివేసే చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను ఇప్పటికైనా స్పందించి వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు నల్లగండ్ల రాజు, ఆంజనేయులు, ఎం వీరేశం, ఏ కృష్ణ, జి ప్రవీణ్ కుమార్, ఎం రాజు, ఎం శ్రీశైలం, ఓబులేసు, మధుసూదన్, హరికిరణ్ లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *