మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
పటాన్ చెరు మండలం ముత్తంగి డివిజన్ లోని నూతన శ్రీ పోచమ్మ దేవాలయం కమిటీని నియమించారు. పోచమ్మ ఆలయం కమిటీ చైర్ పర్సన్ గా గడ్డ పుణ్యవతి నీ ఏకగ్రీవంగా నియమించారు. వైస్ ఛైర్మన్ గా కంజర్ల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి గంగుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి కార్నోల్ల రవి, సహాయ కార్యదర్శి బంగారుగల్ల రవి, సంయుక్త కార్యదర్శి గూడెం బాలరాజు, కోశాధికారి రాధనోళ్ళ రాజు, కన్నుల వెంకటయ్య, కమిటీ సభ్యులు మూర్తి, కమిటీ అడ్వైజర్ సభ్యులు గడ్డ యాదయ్య, డప్పు నర్సింలు, పొట్టల వెంకటేశం, గూడెం మల్లేష్, బంగారుగళ్ళ బిక్షపతి, బంగారుగళ్ల కృష్ణ, కర్నూల్ మల్లేష్ లను కమిటీగా నిమించారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన ఆలయ చైర్పర్సన్ గడ్డ పుణ్యవతి మాట్లాడుతూ ముత్తంగి జిహెచ్ఎంసి పరిధిలోని పోచమ్మ ఆలయం నూతన కమిటీని అందరు సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.
