మనవార్తలు ,శేరిలింగంపల్లి :
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకుఉపయోగపడే గొడుగులను ప్రత్యేకంగా తయారు చేయించిన ఆర్ కె వై టీమ్ సభ్యులు సమక్షంలో ఆదివారం రోజు శేరిలింగంపల్లి మాజి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ లు ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు పంచిపెట్టారు. సమాజ సేవ చేస్తున్న ఆర్ కె వై టీమ్ సబ్యులను అభినందించారు. ముందు ముందు మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోయినిపల్లి వినోద్ రావు, కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, టీమ్ ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్, ఆకుల లక్ష్మణ్, జాజెరావు శ్రీను, గంగారాం మల్లేష్, శ్రీధర్, దినేష్, సోను, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.