సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు
ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు ఆశాలత
ఇష్టా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ తులసి, రజిత
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు,ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు ఆశాలత,ఇష్టా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ తులసి, రజిత లు అన్నారు. సిఐటియు, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో పటాన్ చెరు శ్రామిక్భవన్ లో కేంద్ర ప్రభుత్వ విధానాలు మహిళలపై ప్రభావం అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నారు. దేశంలో మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతున్నాయని, గత సంవత్సరంలో కలకత్తాలో జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం జరిగి, హత్య చేసిన విషయంలో కేంద్ర ప్రభుత్వం సమయానికి స్పందించలేదని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు రోజు దేశంలో ఎన్నో జరుగుతున్నాయని, మహిళలకు భద్రత కరువైందని వాపోయారు. స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్లయిన మహిళలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదని మహిళలకు వంటింటికే పరిమితం కావాలనీ పద్ధతులు విడనాడాలని చెప్పారు.
కార్పొరేట్ శక్తులు తమ వ్యాపారాన్ని సునాయాసం చేసుకోవడం కోసం నేటికీ ఆడవాళ్ళ ఫోటోలు ప్రచార ఆర్భాటాలలో వాడటం దుర్మార్గమన్నారు. మహిళలలు అనేక పరిశ్రమలో పనిచేస్తున్న, తక్కువ వేతనాలు ఇస్తున్నారని పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. మహిళలకు సమాన పనికి సమాన వేతనాలు మహిళలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలు ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్న నేటికీ పురుషాధి పత్యమే నడుస్తున్నదని మండిపడ్డారు. అందుకోసం మహిళలందరూ అన్ని రంగాలలో ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఎంతైనా ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో మహిళల సమస్యల గురించి చర్చించవలసిన అవసరం అందరి పైన ఉందన్నారు. అందుకోసం అన్ని ప్రాంతాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను నిర్వహించవలసిన బాధ్యత మహిళల పైన ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు, ఐద్వా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లలిత ,సునీత, ఆశా వర్కర్ల సంఘం నాయకురాలు హైమావతి, ఇస్నాపూర్ ,వీరమని, ఇంటి పని వారాల సంఘం నాయకురాలు పద్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ మంజుల, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.
