కొండాపూర్ డివిజన్‌లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ విస్తరణ

politics Telangana

– నూతన అధ్యక్షునిగా మహమ్మద్ జాంగిర్ నియామకం

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి:

శేరిలింగంపల్లినియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్‌లో బుధవారం రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ప్రారంభంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కొండాపూర్ డివిజన్ నూతన అధ్యక్షునిగా మహమ్మద్ జాంగిర్‌ను నియమిస్తూ ఆర్డర్ కాపీ అందజేశారు.కార్యక్రమంలో ఆఫీస్‌పేట్ ప్రాంతానికి చెందిన ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. వారికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగాని నర్సింగ్ ముదిరాజ్ మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీల భారీగా పార్టీలో చేరిక పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, తీన్మార్ మల్లన్న ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులపై జరుగుతున్న ఫీజుల దోపిడిని అరికట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జావేద్ భాయ్, ఫిరోజ్ భాయ్, ఫయాజ్ భాయ్, అమర్, సమీర్, షరీఫ్, మౌసీన్, ఖదీర్, జుబేర్, అభిషేక్, నరసింహ తదితరులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *