అమీన్పూర్ లో అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జనం

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో చెరువు కట్ట వద్ద నిర్వహించిన దుర్గామాత నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ […]

Continue Reading

జిఎస్టీ అధికారుల బెదిరింపుల నుండి కాపాడండి

అనధికారికంగా లక్షలు డిమాండ్ చేస్తున్నారు ఖమ్మం, అక్టోబర్ 12 : కరోనా కష్ట కాలంలో కట్టిన ఇండ్లకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నామని, జీఎస్టీ కట్టలేదని ఆఫీసుకు పిలిపించి సూపరింటెండెంట్ ప్రసాద్, భరత్ లు బెదిరించారని బిల్డర్ నూకల రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ బిల్ రూ. 1.40లక్షల ఫైనే ఉందని అందులో రూ. 80వేలు కడితే మొత్తం చూసుకుంటామన్నారని పేర్కొన్నారు. […]

Continue Reading

సీఎంఆర్ఎఫ్ తో నిరుపేదలకు నాణ్యమైన వైద్యం

8 లక్షల 66 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారము ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 8 లక్షల 66 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. […]

Continue Reading

కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం

ప్రజలకు మరింత నాణ్యమైన విద్యుత్తు ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గృహాలకు, పరిశ్రమలకు మరింత నాణ్యమైన విద్యుత్ అందించాలన్న సంకల్పంతో కోటి రూపాయలతో పటాన్చెరు సబ్ స్టేషన్లో 12.5 mva పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, విద్యుత్ సంస్థ ఉన్నత అధికారులతో కలిసి ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ […]

Continue Reading

జర్నలిస్టుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు -టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆగ్రహం

హైదరాబాద్  జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని, వివిధ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు గొప్పలు చెబుకుంటున్న పాలకులు జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) నాయకత్వం ప్రశ్నించింది. ఆదివారం నాడు హైదర్ గుడ లోని సెంటర్ పార్క్ హోటల్ కాన్ఫరెన్స్ హాలులో టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ […]

Continue Reading

షీ టీమ్ లు దేశానికే ఆదర్శం – గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా

పటాన్‌చెరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఏర్పాటు చేసిన షీ టీమ్ లు యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచాయని ఐపీఎస్ అధికారిణి, మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా అన్నారు. గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గీతం విద్యార్థులు, పలువురు అధ్యాపకులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆమె పాల్గొన్నారు. ఎన్డీటీవీ పూర్వ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ – గీతం వ్యూహాత్మక కార్యక్రమాలు విస్తరణ డెరైక్టర్ నిధి సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా గాంధీ జయంతి….

పటాన్ చెరు: జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి ఉత్సవాలను గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో శనివారం ఘనంగా నిర్వహించారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ( ఇంజనీరింగ్ ) ప్రొఫెసర్ వీకే మిట్టల్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సైన్స్ , ఆర్కిటెక్చర్ , ఫార్మశీ ప్రిన్సిపాళ్ళు ప్రొఫెసర్ జీఏ రామారావు , ప్రొఫెసర్ సునీల్ కుమార్ , ప్రొఫెసర్ జీఎస్ కుమార్ […]

Continue Reading

ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా వీఆర్ చౌధరి

హైదరాబాద్ భారత ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం భారత వైమానిక దళం ఉపాధ్యక్షుడు (డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్) గా ఉన్న ఈయనను భారత వాయుసేన కొత్త చీఫ్ గా నియమించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. వెంకటరామ్ చౌదరి 29 డిసెంబర్ 1982 న ఎయిర్ ఫోర్స్ యుద్ధ విభాగంలో చేరారు. ఎయిర్ ఫోర్స్ లో ఈయనకు వివిధ రకాల ఫైటర్ […]

Continue Reading

గీతంలో బీ.ఆప్తో, బీఎస్సీ, ఎమ్మెస్సీ అడ్మిషన్లు

పటాన్‌చెరు: స్కూల్ ఆఫ్ సైన్స్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను బీ.ఆప్తో, బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు మంగళవారం వెల్లడించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలతో నిర్మించిన అధునాతన భవనంలో ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్వీ ప్రసాద్ తో కలిసి బ్యాచిలర్ ఆఫ్ ఆప్లోమెట్రీ (బీ.ఆప్తో), టీసీఎస్ సహకారంతో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విత్ కాగ్నెటిన్ సిస్టమ్స్, బీఎస్సీ […]

Continue Reading

గీతం ఎన్‌సీసీ యూనిట్ ను తనిఖీ చేసిన కమాండర్

పటాన్‌చెరు: పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఎన్‌సీసీ యూనిట్ ను నిజామాబాద్ లోని 33 (తెలంగాణ) బెటాలియన్ ప్రధాన కార్యాలయ కమాండర్ కల్నల్ హెచ్ఎస్ఎస్ కృష్ణకుమార్ గురువారం తనిఖీ చేశారు. ఆయన వెంట 33 (తెలంగాణ) బెటాలియన్, సంగారెడ్డి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ కుమార్ శర్మ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ ఎస్.కె.సింగ్ కూడా ఉన్నారు. కల్నల్ కృష్ణకుమార్ గీతం ఎన్‌సీసీ క్యాడెట్లతో ముఖాముఖి చర్చించడంతో పాటు, వారి పనితీరును ప్రశంసించారు. మెరుగైన ప్రమాణాలను సాధించడానికి […]

Continue Reading