రుద్రారంలో ఘనంగా హనుమాన్ జయంతి

politics Telangana

హనుమాన్ దేవాలయం పునర్నిర్మానానికి భూమి పూజ హాజరైన ఎమ్మెల్యేగూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

హనుమంతుడు భక్తి, శక్తి, వినయం, నిస్వార్థ సేవలకు ప్రతీక అని  యన జీవితం మనుషులందరికీ ఆదర్శప్రాయమని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం గ్రామ పరిధిలోని జాతీయ రహదారి పక్కన గల వీర హనుమాన్ దేవాలయం పరిధిలోగల హనుమాన్ విగ్రహానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలలో ప్రత్యేక పూజలు పాల్గొని పని దర్శించుకున్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను భక్తి భావం పెంపొందించడంలో నూతన దేవాలయాలు ఎంత గానో దోహదపడతాయని తెలిపారు. హనుమాన్ దేవాలయం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ మోటే సుమలత, కౌన్సిలర్ పాండు, మాజీ ఎంపీపీలు దేవానందం, గాయత్రి పాండు, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచులు సుధీర్ రెడ్డి, వెంకన్న, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు రాజు, సంధ్య, లత, రాజు, కిషోర్ రెడ్డి, రాహుల్ రెడ్డి, నరసింహ రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *