మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
సంగారెడ్డి జిల్లా,పఠాన్ చేరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపాలిటీ బచ్చుగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భుజంగ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు పద్మావతి ఫంక్షన్ హాల్ లో అత్యంత వైభవంగా నిర్వహించారు . ఆయన 49 ఏళ్లు పూర్తి చేసుకొని 50 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అభిమానులు, పార్టీ శ్రేణులు ఈ వేడుకలను పండుగలా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, యువత, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, రామేశ్వరం బండ గ్రామ పెద్ద కౌన్సిలర్ అంతిరెడ్డి, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చారు. భుజంగ రెడ్డి కి గజ మాలలు,పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అభిమానులు, యువత మధ్య ఆయన భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు,అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ భుజంగ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే నిజమైన ప్రజా నాయకుడు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ జన్మదిన వేడుకల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు
