బస్సు దిగే లోపే మహిళ నుంచి బంగారం చోరీ

Crime Districts Telangana

5 తులాల బంగారం, నాలుగు వేల నగదు దొంగిలించిన గుర్తుతెలియని వ్యక్తులు

పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఆర్టీసీ బస్సు దిగే లోపే ఓ మహిళ నుంచి బంగారం, నగదు దొంగతనానికి గురైన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు సంగారెడ్డి శాంతినగర్ కు చెందిన రేష్మ బేగం భర్త (శాండ్విక్ పరిశ్రమకు చెందిన తౌఫిక్ అలీ) శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇస్నాపూర్ చౌరస్తాలో పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. పటాన్ చెరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి పైన బస్సులు ఆగే స్థలంలో బస్సు దిగే సమయంలో తన వద్ద ఉన్న ఎర్రటి బ్యాగులో ఉన్న ఐదు తులాల బంగారము( మంగళసూత్రం, హారం,రింగులు) నాలుగువేల నగదును గుర్తుతెలియని దొంగలు దొంగిలించారు. దిగుతున్న సమయంలో చూసుకోగా బ్యాగు కనిపించకపోవడంతో వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *