మనవార్తలు , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ నుండి భారీ ఎత్తున యువకులు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి రవికుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సామాజిక సేవాకార్యక్రమం లో రవి కుమార్ యాదవ్ జన్మదినo సందర్భంగా మక్తా గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గడ్డం వరలక్ష్మి గత కొన్ని రోజులుగా మెదడు వ్యాధితో బాధపడుతుoది.
బీజేపీ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సదరు విద్యార్థినికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి, అక్కడ చదువుతున్న విద్యార్థినీ ,విద్యార్థులకు ఉచితoగా బిర్యానీ ప్యాకెట్లను అందించారు.ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర రావు, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, మల్లేష్, శ్రీను, రాము, చందు, అంజనలు, సోను కుమార్, దినిష్, నరేష్, దుర్గేశ్వర్, శ్యామ్, అంజి, హరి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.