నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

పటాన్‌చెరులో కన్యకా పరమేశ్వరి దేవాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన..

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో భాగంగా నియోజకవర్గం వ్యాప్తంగా నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని పంచముఖి హనుమాన్ దేవాలయం ఎదురుగా నూతనంగా నిర్మించ తలపెట్టిన కన్యకా పరమేశ్వరి దేవాలయం నిర్మాణ పనులకు ఆదివారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులతో 220 కి పైగా దేవాలయాలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *