చిట్కుల్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తిచేసి అర్హులైన పేదలకు ఇ వ్వాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఇస్నాపూర్ మున్సిపల్ లోని చిట్కుల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, కోర్టులో ఉన్న సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చిట్కుల్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ నిర్మించిన ఇండ్ల సముదాయాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ చిట్కుల్ గ్రామంలో 329 సర్వే నెంబర్లో ఐదు ఎకరాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని గత 15 సంవత్సరాల క్రితం ప్రారంభం చేసి, ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారని. డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంలో భూములు కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని, కోర్టులో కొనసాగుతున్న కేసును వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. 329 సర్వే నెంబర్లలో ఇల్లు నిర్మించుకున్న వారికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని, రెవెన్యూ వారు చేస్తున్న కూల్చివేతలను వెంటనే ఆపివేయాలన్నారు.బచ్చు గూడెం, కర్దనూర్, పటేల్ గూడా, నాగులపల్లిలో వేలాది మంది కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎక్కడ స్థానికులకు ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పెండింగ్ లో ఉన్న వాటిని పూర్తిచేసి అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని లేనిపక్షంలో పేదల పక్షాన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఏరియా కమిటీ సభ్యులు ఆర్ శాంత కుమార్, నల్లగండ్ల రాజు, సిపిఎం పార్టీ నాయకులు జె పోచయ్య,రాజ్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *