కార్మికవర్గ ప్రయోజనాలకోసం సిఐటియు నిరంతర పోరాటం

politics Telangana

-కార్మిక హక్కులను హరించి లాభాలు ఆర్జించాలని ఉవ్విళ్లూరుతున్న యజమాన్యాలు

-శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ 18 వ మహాసభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,ఎస్ఈ యు అధ్యక్షులు చుక్క రాములు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

కార్మికవర్గ ప్రయోజనాలకోసం నికరంగా పోరాడుతున్న సంఘం సిఐటియు అని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,ఎస్ఈ యు అధ్యక్షులు చుక్క రాములు అన్నారు.పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో గల శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ 18 వ మహాసభను పరిశ్రమ ఆవరణలో ఆదివారం ఘనంగా నిర్వహించింది. ఈ మహాసభకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,ఎస్ఈ యు అధ్యక్షులు చుక్క రాములు పాల్గొని యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికవర్గ ప్రయోజనాలకోసం నికరమైన పోరాడుతున్న ఏకైక సంఘం సీఐటీయూ అన్నారు. కార్మిక వర్గం మెడపై ఉంచిన లేబర్ కోడ్స్ లలో అనేక అంశాలలో స్పష్టత లేదని, ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కార్మిక హక్కులు హరించి మరింత లాభాలు ఆర్జించాలని యాజమాన్యాలు ఉవ్విళ్లూరుతున్నాయని ఆరోపించారు. లేబర్ కోడ్స్ ప్రకారం 10 శాతం పిఎఫ్ కట్ చేస్తే సరిపోతుందని, ఇది అమలైతే కార్మికులు నష్టపోతారన్నారు. వర్కింగ్ హవర్స్ పై దాడి జరుగుతోందని. మనకు తెలియకుండానే పెద్ద ప్రమాదం మన తలుపు తడుతోందని ఇలాంటి నేపథ్యంలో మన యూనియన్ మరింత చైతన్యయుతంగా పనిచేయాల్సిన అవసరంముందని ఆయన నొక్కి చెప్పారు.

గత 42 సంవత్సరాలుగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సీఐటీయూ కంటిన్యూటీ నాయకత్వంతో ఐక్యంగా వాటిని ఎదుర్కొని ఒక ఆదర్శవంతమైన యూనియన్ గా ఇతరులకు మార్గదర్శిగా శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ కొనసాగుతుకు 40 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. సీనియర్స్ ఒక్కొక్కరుగా రిటైర్ అవుతున్న ప్రస్తుత దశలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. యంగ్ వర్కర్స్ విషయంలో CITU ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు కృషి చేస్తున్నామని అన్నారు. అనంతరం కారదర్శి ప్రవేశపెట్టిన కార్యకలాపాల రిపోర్ట్ మరియు ట్రెజరర్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ ను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఈ మహాసభలో లేబర్ కోడ్స్ ను రద్దు చెయ్యాలని, కనీసవేతనం రూ. 26000- నిర్ణయించి అమలు చెయ్యాలనే తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది.
అనంతరం నూతన ఆఫీస్ రర్స్ మరియు కమిటీ సభ్యులను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులుగా చుక్క రాములు, అడ్వైజర్ పి. పాండురంగా రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎమ్. సత్తిబాబు, వైస్ ప్రెసిడెంట్ గా ఎమ్. మనోహర్, జనరల్ సెక్రెటరీగా బి. ప్రదీప్ కుమార్, జాయింట్ సెక్రటరీగా జి. గణేష్, ఆఫీస్ సెక్రెటరీగా కె. సురేష్ కుమార్, ట్రెజరర్ గా వి. సదాశివ రెడ్డి 10 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను వివిధ డిపార్టుమెంట్స్ నుండి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *