సుల్తాన్పూర్ లో 10 లక్షల రూపాయల సొంత నిధులతో శివాజీ విగ్రహావిష్కరణ
మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ :
నేటి యువతరానికి స్ఫూర్తి ప్రదాత అయిన చత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పరిపాలనదక్షుడని అమీన్పూర్ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో 10 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం వేలాది మంది ప్రజల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివాజీ మహారాజ్ గొప్ప పోరాటయోధుడు గానే కాకుండా గొప్ప పరిపాలనాదక్షుడుగా పేరు పొందారని అన్నారు. చరిత్రలో గొప్ప నాయకులుగా కీర్తించబడ్డ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. వారి చరిత్రను, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను నేటి తరానికి తెలియజేయడమే ప్రధాన ఉద్దేశం అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో శివాజీ విగ్రహాల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. యువత పెడదారి పట్టకుండా దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ సర్పంచులు పట్నం రాజు, భాస్కర్ గౌడ్, పాండు, సీనియర్ నాయకులు మల్లేష్, శ్రీకాంత్, శివాజీ మహారాజ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు గణేష్, గ్రామ పుర ప్రముఖులు, యువత పాల్గొన్నారు.
