ముత్తంగి పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

– ఇస్నాపూర్ పాలకవర్గానికి షోకాజ్ నోటీస్ – సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పటాన్‌చెరు: అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామపంచాయతీ కార్యదర్శిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. ముత్తంగి కార్యదర్శి కిషోర్ అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇవ్వగా, జిల్లా పంచాయతీ అధికారి తనిఖీలో అక్రమ నిర్మాణాలు గుర్తించి, వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, తొలగించడంలో నిర్లక్ష్యం […]

Continue Reading

క్రమశిక్షణకే పెద్దపీట… – ఎన్ సీసీ క్యాంపు ప్రారంభోత్సవంలో కల్నల్ ఎస్.కె సింగ్

పటాన్‌చెరు: క్రమశిక్షణకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, చెప్పిన సమయానికి తగిన దుస్తులలో క్యాడెట్లు హాజరై ఈ పది రోజుల సంయుక్త వార్షిక శిక్షణా శిబిరాన్ని (సీఏటీసీ) సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డిలోని 33వ తెలంగాణ ఎన్ సీసీ బెటాలియన్ పాలనాధికారి కల్నల్ ఎస్.కె సింగ్ సూచించారు. పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఎన్ సీసీ క్యాంపును గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలు […]

Continue Reading

పేదలకు భూములు పంచాలంటూ రామచంద్రాపురం,అమీన్ పూర్ ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట బీఎస్పీ నిరసన కార్యక్రమం

రామచంద్రాపురం అర్హులైన భూమిలేని నిరుపేద కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని కేటాయించాలని బీఎస్పీ పటాన్ చెరు అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎస్ వినయ్ కుమార్ డిమాండ్ చేశారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో బీఎస్సీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రామచంద్రాపురం, అమీన్ పూర్ ఎంఆర్ ఓ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు. పేదలకు మూడు ఎకరాల భూమి కేటాయించాలని , పోడు భూములకు పట్టాలు కల్పించాలని,అసైన్డ్ భూములను ప్రభుత్వ నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ […]

Continue Reading

మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య విభేదాలు పెడుతుందని_మొహ్మద్ జవాద్ అహ్మద్

 ఖమ్మం ఖమ్మం ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమానికి ముస్లిం మతాపెద్దలతో సహా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరై ప్రసంగించారు. మొహ్మద్ జవాద్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన సభలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య విభేదాలు పెడుతుందని ప్రత్యేకంగా ముస్లింల పట్ల వివక్షత చూపిస్తూ పాలన సాగిస్తుందని.ఆరోపించారు.ఇటీవల అస్సాంలో జరిగిన సంఘటన యావత్ ప్రపంచం చూసింది. అక్కడ గళం విప్పి మాట్లాడిన ముస్లిం మేధావి మౌలానా ఖెలీక్ సిద్దిక్ ను అక్రమంగా […]

Continue Reading

హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఆర్యవైశ్య అభ్యర్ధిగా సిద్ధంగా ఉన్న వెంపటి రంగారావు.

ఖమ్మం : హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఆర్యవైశ్య అభ్యర్ధులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్య సంఘాల వేదిక అధ్యక్షులు బుస్సా శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారని వైశ్య సమాజ సేవకుడు మరియు సాదనారత్నo , వైరా పట్టణానికి చెందిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్యవేదిక సంఘాల రాష్ట్ర కార్యదర్శి వెంపటి రంగారావు ఒక ప్రకటనలో తెలిపారు . ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటును చెయ్యకుండా మరియు ఇవ్వకుండా మోసం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆర్యవైశ్య […]

Continue Reading

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఏర్పాట్లు పూర్తి

– అక్టోబ‌రు 11, 12వ తేదీల్లో ముఖ్య‌మంత్రితో ప‌లు ప్రారంభోత్స‌వాలు   – వెనుకబడిన పేద వర్గాల భక్తులకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం తిరుమ‌ల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి గారు తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం సాయంత్రం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ గారు మాట్లాడుతూ అక్టోబరు 7వ తేదీ […]

Continue Reading

 బతుకమ్మ వేడుకలకు హాజరైన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…

పటాన్‌చెరు: తెలంగాణ ఆడబిడ్డల ప్రత్యేక పండగ బతుకమ్మ సంబరాలు నేటి నుండి మొదలవడంతో పటాన్చెరు పట్టణంలోని వీధులన్నీ బతుకమ్మ ఆటపాటలతో పండుగ వాతావరణం సంతరించుకున్నాయి. గొనెమ్మ బస్తీలోని గొనెమ్మ ఆలయం మరియు జేపీ కాలనీ లోని గుడి వద్ద జరిగిన బతుకమ్మ సంబరాలలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు హాజరవడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మొదలవడంతో పట్టణం లోని వీధులన్నీ ఆడబిడ్డల ఆటపాటలతో నూతన కల సంతరించుకున్నాయని అన్నారు. […]

Continue Reading

నేడు బద్వేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమలమ్మ నామినేషన్

విజయవాడ : బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ శాసన సభ్యురాలు పి.ఎమ్ కమలమ్మ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కమలమ్మను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 10గంటలకు బద్వేలు లో నామినేషన్ దాఖలు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.సాకే శైలజనాథ్ మరియు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొంటారు.

Continue Reading

స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ సహాయం వికలాంగుల ట్రై సైకిల్

రాజమండ్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం పొట్టిలంక గ్రామం కు చెందిన అంకం వీరబాబు అనే వికలాంగుడు గత నెలలో రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ గారు పొట్టిలంక గ్రామ పర్యటనలో ఉండగా అంకం వీరబాబు చందన నాగేశ్వర్ గారిని కలిసి తనకు వికలాంగుల ట్రై సైకిల్ కావాలి అని కోరారు. దానికి స్పందించిన చందన నాగేశ్వర్ గారు ఈ రోజు వారి పార్టీ కార్యాలయంలో అంకం […]

Continue Reading

దుర్గమ్మ విద్యుత్ దీపాలు కు తప్పని పార్టీ రంగులు..

విజయవాడ ఏమిటో ఈ రంగుల గోల.. నిన్న బడి,కనపడిన ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వైసీపీ పార్టీ జెండా రంగులు వేసేశారు..చివరకు హైకోర్టు అక్షింతలతో కొన్ని కార్యాలయాలకు రంగులు తొలగించారు.మరి కొన్ని ఇంకా అలాగే ఉన్నాయి.ఇప్పుడు దేముడి గుడిని కూడా వదలడం లేదు.బులుగు,ఆకుపచ్చ బల్బులతో బెజవాడ దుర్గమ్మ ఆలయాన్ని విద్యుత్ బల్బులతో అలకరించేశారు..ఎవరు ఇచ్చారో ఈ ఐడియా కానీ రాత్రి వేళ అమ్మవారి ప్రధాన ఆలయం చుట్టూ వైసీపీ పార్టీ జెండా రంగులే కనపడుతున్నాయి. ఇలాంటి సంస్కృతి తీసుకురావడం […]

Continue Reading