పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
‘ఫినెల్డ్ కార్బమేట్లు, బెబ్రాహెడ్రో ఫ్యూరాన్ ఉత్పన్నాల సంశ్లేషణ కోసం పరివర్తన లోహ ఉత్ప్రేరకాలు: ఉపయోగించడం ద్వారా ఫంక్షనల్ గ్రూపు పరివర్తనాలు’ అనే అంశంపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి. వి. మనోజకుమార్ను డాక్టరేట్ వరించింది.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెక్ట్స్ ని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చితలూరి సుధాకర్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. లింగాను ఉపయోగించడం ద్వారా ఫెనెల్త్ కార్బమేట్లు, టెట్రాహెడ్రోఫ్యూరాన్ ఉత్పన్నాలను సంశ్లేషణ చేయడంతో పాటు ప్రత్యక్ష సీ-హెచ్ బాండ్ ఇనిషియేషన్ తర్వాత ఆక్సీకరణ క్రాస్-కప్లింగ్ ఈ పరిశోధన ప్రధాన లక్ష్యంగా ఆయన వివరించారు.
మనోజ్ కుమార్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం: విశ్వవిద్యాలయం, హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీసిసిఎస్ఆర్ -వర్మ, స్కూల్ ఆఫ్ సెర్చ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె, నగేష్, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.