పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసి, తయారు చేసే సొంత సాంకేతికతను సాధించే లక్ష్యంతో మనదేశం ముందుకు సాగుతోందని రక్షణ రంగ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) శాస్త్రవేత్త రాజేష్. ఎస్. కర్వాండే అన్నారు. గీతం. డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెద్దదాబాద్లో గురువారం ‘హవానా – 2.0’ పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ అంతర్ కళాశాల సాంకేతికోత్సవ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆయనమాట్లాడుతూ, విద్యార్థులకు ఏవైనా నినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు ఉండి, నాటికి నిధులు అవసరమైతేడీఆర్డీవోను సంప్రదించాలని వర్ధమాన ఇంజనీర్లకు సూచించారు. ఈ డీవోనిఫ్ నమూనా అధారిత న్యూట్ ల్యాబ్అభివృద్ధికి గీతం విద్యార్థులు సహకరించారని చెబుతూ, ఈ సందర్భంగా వారిని డీఆర్డీవో శాస్త్రవేత్త (ప్రశంసించారు.

నూతన సాంకేతికతలు నేర్చుకోవడానికి పానానా ఓ అద్భుత అవకాశంగా స్కూల్ ఆఫ్ బిజినెస్ డెరైక్టర్. ప్రొఫెసర్ కరుణాకర్.బి అభివర్ణించారు. నుంచి ప్రతి చోటా ఉందని, విద్యార్థులు దానిని అలవరచుకోవాలని రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ఉద్బోధించారు. ఈఈసీఈ విభాగం గురించి, నారు సాధించిన విజయాల గురించి ఆ విభాగాధిపతి ప్రొఫెసర్ మాధవి తాతినేని వివరించారు. కార్యక్రము సమన్వయకర్తలు ఎం.వరేష్ కుమార్, డాక్టర్ డి.అనిత, ఎం.ప్రవీణ్ లతో పాటు జి-ఎలక్ట్రా అధ్యక్షుడు ఎం.ప్రవీణ్ తదితరులు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఆ తరువాత తెలుగు టెక్ టట్స్కు చెందిన సయ్యద్ హఫీజ్, వాసు టిక్ క్లోగ్స్క చెందిన నాసు గడ్డం తదితరులు విద్యార్థులతో విడివిడిగా ముఖాముఖి నిర్వహించారు. జంట నగరాలలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన దాదాపు 20 సాంకేతిక నమూనాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. పలువురు విద్యార్థులు. సాంకేతిక పత్ర సమర్పణ చేశారు. శుక్రవారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది.
