మంత్రి కొప్పులఈశ్వర్ తో మాజీ మంత్రి కనుమూరి భేటీ

Andhra Pradesh politics

_తాజా రాజకీయాలపై చర్చ

_బి ఆర్ యస్ ఆవిర్భావం పై మాటమంతి

మనవార్తలు .తిరుపతి:

తిరుపతి పర్యటనలో తెలంగాణ యస్ సి అభివృద్ధి మరియు మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు లు ఒకరికొకరు తారసపడి మాట మంతి తెలుసుకున్నారు.వీరిరివూరి నడుమ తాజా రాజకీయాలు చర్చకు వచ్చాయి.ఒకరినొకరు పలకరింపులు జరిగాక మాటా మంతి కలిపిన కనుమూరి తెలంగాణా రాజకీయలు వాటి ప్రభావం తో పాటు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి పార్టీపై ప్రధానంగా చర్చకు వచ్చింది.దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న కోణంలో జాతీయ పార్టీ వైపు వేసిన అడుగుల గురించి వాకబు చేస్తూనే పార్టీ విధి విధానాలు ఏ విదంగా ఉండ బోతున్నాయన్నది తాజా., మాజీ మంత్రుల మధ్యన జరిగిన చర్చ ఆసక్తికరంగా సాగింది.కలియుగ దైవం శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన కీలక నేతల కలయిక తిరుమలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరిలో తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణితో పాటు కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడం హైలెట్ గా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *