మనవార్తలు ,సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజు నవభూమి విలేకరి నరసింహ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా పిల్లలకు ఆడుకోవడానికి పాఠశాల అధ్యాపాకుల కోరిక మేరకు క్యారం బోర్డులు, స్కిప్పింగ్ తాడులు,రింగ్స్ ను టీ. రవీందర్ రెడ్డి చేతుల మీదుగా అందచేయడం జరిగింది. చదువుతో పాటు శారీరక శ్రమ, అట పాటలు కూడా ముఖ్యమే కాబట్టి అట వస్తులు బహుకరించ చారు .ఈ కార్యక్రమంలో కౌన్సెలర్ వి. శ్రీకాంత్ యాదవ్, టీఆర్ఆర్ కుటుంబ సభ్యులు రాఘవేంద్ర రెడ్డి, లక్ష్మణ్ స్వామి, టీ. మేఘన రెడ్డి, కే. సరస్వతి,శ్రీకాంత్ రెడ్డి, రోహిత్ సింగ్,ఎస్. లక్ష్మి, పాఠశాల హెడ్ మాస్టర్ శేషిధర్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.