మనవార్తలు , శేరిలింగంపల్లి :
కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పటాన్చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ను, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ మరియు పటాన్ చెరు టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ లను పటాన్ చెరు మైత్రి గ్రౌండ్స్ లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.
కొత్త సంవత్సరం లో ప్రజలందరూ ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో ఉండాలని. కొత్తగా వచ్చిన వైరస్ నుండి ప్రజలను ఆ భగవంతుడు కాపాడాలని కోరుతున్నట్లు కృష్ణ మూర్తి చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కార్యదర్శి సర్దార్ తారా సింగ్,మైత్రి క్లబ్ ప్రెసిడెంట్ హనుమంత్ రెడ్డి, మైత్రి క్లబ్ సెక్రెటరీ పాండియన్ ,షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.