చిత్తూరు జిల్లా..
కార్వేటినగరంలో నిర్వహించిన 2వ విడత ఆసరా కార్యక్రమానికి హాజరైన చిత్తూరు జెడ్పిచైర్మన్ జి.శ్రీనివాసులు(వాసు) ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు నారాయణస్వామి. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన హామీలను మాట తప్పకుండా అమలు చేస్తున్నారని తెలియజేశారు.
అదేవిధంగా గా నవరత్నాలు, అమ్మబడి, ఫీజు రియంబర్స్మెంట్, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు, డ్వాక్రా రుణమాఫీ, రైతు భరోసా మొదలైన హామీలను అమలు చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని తెలియజేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో 14 నియోజక వర్గాలను అభివృద్ధి బాటలో నడిపిస్తారని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి కోసం అం లెక్కలేనన్ని హామీలిచ్చి ఒకటి అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరినరాయన , ఎంపీ రెడ్డప్ప , ఎమ్మెల్యే ఆధిమూలం , ఎమ్మెల్యే హరని శ్రీనివాసులు , స్థానిక జెడ్పిటిసిలు, డ్వాక్రా మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.