సిద్ధి గణపతిని దర్శించుకున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

శ్రీ గణేష్ గడ్డ శుద్ధి గణపతి దేవస్థానంలో సంకష్టహర చతుర్దశి పురస్కరించుకొని పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ది గణపతి దేవస్థానం వేలాది మంది భక్తులు సిద్ధి గణపతినీ దర్శించుకున్నారు. తెలంగాణ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక పూజలు పాల్గొని గణపతినీ దర్శించుకున్నారు .ఆలయ అర్చకులు, కౌన్సిలర్ లతా వెంకటేష్, వడ్డే రాజు, పాండు,మరియు బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు శాలువాలతో సన్మానించారు .అనంతరం మాట్లాడుతూ రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ సిద్ధి గణపతిగా స్వయంభుగా వెలసి కోరిన కోరికలు నెరవేర్చడానికి కొంగుబంగారంగా ప్రతి భక్తులకు దర్శమిస్తున్నాడు, చుట్టుపక్క రాష్ట్రాల నుండి గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు, ఆలయ ఈవో లావణ్య మరియు ఆలయ అర్చకులు సిబ్బంది పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ప్రతిరోజు నిత్యా అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తుడడం చాలా సంతోషకరమని తెలిపారు . ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గడిల శ్రీకాంత్ గౌడ్,ఇస్నాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు లత వెంకటేష్ , బి పాండు, రాజు సంధ్య నవీన్ రెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీకాంత్,మీరాజ్ ఖాన్,మన్నె రాజు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *