ఓటర్ల జాబితా పై ఫోకస్ పెట్టిన బిజెపి నాయకత్వం
జిహెచ్ఎంసి ఎన్నికలపై బిజెపి ప్రత్యేక కార్యచరణ
డబుల్ ఓట్ల తొలగింపు పై బిజెపి ప్రత్యేక దృష్టి
రాబోయే ఎన్నికలు భారీ మెజార్టీ లక్ష్యం ఈర్ల రాజు ముదిరాజ్
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడ డివిజన్ పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీఎల్ఏ-2లతో కీలక సమావేశం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో పటేల్గూడాలో జరిగిన ఈ సమావేశానికి సంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొల్కూరి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బీఎల్ఏ-2లు పార్టీకి అత్యంత కీలకమని అన్నారు. ప్రతి ఓటు సరైన వ్యక్తికి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డబుల్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లను గుర్తించి తొలగించే ప్రక్రియలో బీఎల్ఏలు చురుకుగా పని చేయాలని పిలుపునిచ్చారు.రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయానికి బీఎల్ఏ-2ల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో పార్టీ భారీ విజయాలకు ఇలాంటి క్షేత్రస్థాయి వ్యవస్థలే కారణమయ్యాయని తెలిపారు.డివిజన్ అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ గత పార్లమెంట్ మరియు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీకి భారీ మెజార్టీ రావడంలో కార్యకర్తల కృషి ఎంతో ఉందన్నారు. అదే స్పూర్తితో ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పార్టీకి భారీ మెజార్టీ తీసుకురావాలని బీఎల్ఏ-2లకు సూచించారు. బీఎల్ఏ-2 సభ్యులకు పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు అంజిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు రాజేందర్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, మండల్ కన్వీనర్లు రాకేష్ గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు జయ బాలరాజ్, రమేష్, కుమార్, కట్ట గణేష్, సాయి కుమార్ యాదవ్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
