పటాన్‌చెరులో ప్రభుత్వ నాయబ్ ఖ్వాజీ కార్యాలయం ప్రారంభం

politics Telangana

-పటాన్‌చెరు రామచంద్రపురం అమీన్‌పూర్ జిన్నారం మండలాలకు

ప్రభుత్వ నాయబ్ ఖ్వాజీగా హాఫిజ్ మొహమ్మద్ ఇబ్రహీం నియామకం

-ఖ్వాజీ ఆఫీసులు మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో ప్రాంతీయ వక్ఫ్ బోర్డుల ఆమోదంతో పనిచేస్తాయి

-ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ చట్టపరంగా నాయబ్ ఖ్వాజీ హాఫిజ్ మొహమ్మద్ ఇబ్రహీం ద్వారా చేయించుకోవాలి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వ నాయబ్ ఖ్వాజీ కార్యాలయం అధ్యక్ష ఖ్వాజీ హాజీ సయ్యద్ లతీఫ్ అలీ ఖాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు మండలాల ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ నాయబ్ ఖ్వాజీ హాఫిజ్ మొహమ్మద్ ఇబ్రహీం ను సంప్రదించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవాలని తెలిపారు. ముస్లిం వివాహం నిఖా జరిగిన తర్వాత, ఆ వివాహాన్ని రిజిస్టర్ చేయడం చట్టపరంగా ముఖ్యమని తెలిపారు.దీనికోసం ఖాజీ కార్యాలయంలో నిఖా నామా నమోదు చేస్తారని తెలిపారు. వధూవరులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్టు సైజ్ ఫోటోలు,ఆహ్వాన పత్రికను సమర్పించి తమ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోవాలని తెలిపారు.ఖ్వాజీ జారీ చేసిన నిఖా నామా భారత చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే సాక్ష్యంగా పరిగణించబడుతుందని తెలిపారు. క్వాజీ కార్యాలయాలు మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో, ప్రాంతీయ వక్ఫ్ బోర్డు ఆమోదంతో పనిచేస్తాయని, వివాహాలు ధార్మిక కార్యకలాపాల కోసం ఇది ఏర్పాటు చేయబడతాయని, ఖ్వాజీ కార్యాలయ అధికారిక గుర్తింపు కోసం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వెబ్ సైట్ ను సంప్రదించడం మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు సయ్యద్ జహీర్, ఇమామ్ సహాబ్ జామ మస్జిద్ బిహెచ్ఇఎల్ మొహమ్మద్ అబ్దుల్ సత్తార్, డాక్టర్ ఫహీం, ఇస్మాయిల్, జావిద్ హుస్సేన్, ముజీబుర్ రహ్మాన్, సలీం ఖాన్, ముస్తఫా, అన్సార్, సమీర్, యూసుఫ్, వాజిద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *