ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

మానవసేవయే మాధవసేవ అని, వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు శ్రీ భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పటాన్‌చెరు బస్టాండ్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రశంసించారు. ఆదివారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్య సాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు భక్తి భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు రూపొందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మార్కెట్ రోడ్డులో మురళి కిరాణా యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సైతం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రామిరెడ్డి, రాజు, రామ్మోహన్ మల్లేష్, అజ్మత్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *