మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ :
అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్క్ కాలనీ లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఆదివారం పటాన్చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన సంస్కరణలలో భాగంగా ఇటీవల అమీన్పూర్ మున్సిపాలిటీ జిహెచ్ఎంసిలో విలీనం కావడం జరిగిందని తెలిపారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వెంటనే నిధులు కేటాయించాలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన జనాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు కృష్ణ, ఉపేందర్ రెడ్డి, గోపాల్, తలారి రాములు, అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
