వెనిజులా పై అమెరికా దుశ్చర్యను ఖండించండి

politics Telangana

అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి

వెంటనే వెనిజులా అధ్యక్షుని విడుదల చెయ్యాలి

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

వెనిజులా పై అమెరికా పాశవిక దాడిని ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండించాలని శాండ్విక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎమ్ మనోహర్ అన్నారు.వెనిజులా పై అమెరికా దుశ్చర్యను నిరసిస్తూ పటాన్ చెరు పారిశ్రామిక వాడ లో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన, ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాండ్విక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎమ్ మనోహర్ మాట్లాడుతూ వెనిజులా లో ఉన్న అపారమైన చమురు, ఖనిజాలపై అమెరికా ఎప్పటినుండో కన్నువేసి అనధికార పెత్తనం చెలాయిస్తూ నేడు అత్యంత పాశవిక దాడికి పాల్పడిందని విమర్శించారు. అమెరికా దుశ్చర్యలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని, ఐక్యరాజ్య సమితి తక్షమే జోక్యం చేసుకోవాలని, వెనిజులా అధ్యక్షుడిని తక్షణమే విడుదల చెయ్యాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఎ. వీరారావు, జాయింట్ సెక్రటరీ వి సదాశివ రెడ్డి, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *