మణికొండ అల్కాపూర్ టౌన్ షిప్ లో అలీవ్ మిఠాయి షోరూంను ప్రారంభించిన మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్
హైదరాబాద్ మణికొండ అల్కాపూర్ టౌన్ షిప్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆలీవ్ మిఠాయి షాప్ ను మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ ప్రారంభించారు .అలీవ్ తో తయారు చేసిన స్వీట్స్, కారా టేస్ట్ ను మణికొండ ప్రజలకు అందించేందుకు షోరూంను ఏర్పాటు చేసినట్లు అలీవ్ మిఠాయి ఛైర్మన్ దొరరాజు తెలిపారు. మిని ఇండియాగా ఉన్న మణికొండ ప్రజలు తమను ఆదరించాలని కోరారు.
స్వీట్ లవర్స్ కోసం మోతీచూర్ లడ్డుతో పాటు అన్ని రకాల స్వీట్స్ పై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు దొరరాజు తెలిపారు . పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు ప్రయత్నంగా కాగితంతో తయారు చేసిన బ్యాగులలో స్వీట్స్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు . పాలిధిన్ కవర్లకు స్వస్తి పలికి కేవలం పేపర్ తో తయారు చేసిన బ్యాగులు , జ్యూట్ బ్యాగులతో మాత్రమే మిఠాయిలను అందిస్తున్నామన్నారు . పండుగలు, ఫంక్షన్లు , ఇతర కార్యక్రమాలకు ప్రత్యేకంగా గిఫ్ట్ ఫ్యాకులను అందిస్తున్నట్లు దొరరాజు తెలిపారు .
ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ ఛైర్మన్ కస్తూరి నరేందర్ తో పాటు కౌన్సిలర్లు నవీన్ , లక్ష్మీనారాయణలతో పాటు అక్కాపూర్ టౌన్ షిప్ ప్రెసిడెంట్ శంకర మహదేవ్, సెక్రటరీ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు .