ఛలో హైదరాబాద్ కు వికలాంగులంతా తరలిరావాలి
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు పి మేరీ, జయలక్ష్మి
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
వికలాంగుల పెన్షన్‌తో పాటు చేయూత పెన్షన్స్ పెంచాలని డిమాండ్ చేస్తూ మార్చి 13 న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద వికలాంగుల సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని *వికలాంగుల హక్కుల జాతీయ వేదిక( ఎన్.పి.ఆర్.డి) రాష్ట్ర కమిటీ సభ్యులు పి మేరీ, జయలక్ష్మి తెలిపారు. ఆదివారం వారు పటాన్ చెరులో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతున్న పెన్షన్స్ పెంచడం లేదన్నారు. 2023 డిసెంబర్ నుండే పెన్షన్స్ పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హామీని అమలు చేయకుండా వికలాంగులను మోసం చేశారని వాపోయారు.బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రభుత్వం వికలాంగుల పట్ల చిన్న చూపు చూస్తుందని మండిపడ్డారు. కొత్త పెన్షన్స్ మంజూరు కోసం 26 నెలల నుండి చేయూత లబ్ధిదారులు ఎదురుచూస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ పెంచుతు ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్, బడ్జెట్ పెంపు కోసం ఫిబ్రవరి 13 న ఇందిరా పార్క్ వద్ద జరిగే నిరాహార దీక్షలో జిల్లాలోని వికలాంగులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
