దుర్గా నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించండి సర్పంచ్ కు  వినతిపత్రం

అమీన్పూర్ దుర్గా నగర్ కాలనీ లో మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని దుర్గ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్పంచ్ ఏర్పుల కృష్ణ. పంచాయతీ కార్యదర్శి వెంకట్ లకు ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మండలంలోని కిష్టారెడ్డిపేట దుర్గా నగర్ కాలనీ లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ ద్వీపాలు సరిగ్గా లేకపోవడం.కాలనీ ప్రజలందరికీ ఇబ్బందికరంగా మారిందన్నారు. […]

Continue Reading

నిరుపేదలకు వరం సిఎంఆర్ఎఫ్

పటాన్ చెరు నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ వరప్రదాయినిగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 19 మంది లబ్ధిదారులకు మంజూరైన ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. […]

Continue Reading

మాధవపురి హిల్స్ లో పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ మాధవపురి హిల్స్ కాలనీ లో ఏర్పాటుచేసిన పార్కు నిర్మాణానికి కాలనీవాసులు స్వచ్చందంగా విరాళాలు అందజేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డు మాధవపురి హిల్స్ కాలనీ లో 70 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పార్కును స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎకరా విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో […]

Continue Reading

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు: చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తల్లిదండ్రులు నీలం రాధమ్మ, నిర్మల్ గత కొన్ని రోజుల క్రితం మరణించారు. వారి జ్ఞాపకార్థంగా సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా అమీన్ పూర్ మండల పరిధిలోని నర్రేగూడెం గ్రామంలో స్వర్గీయ నీలం రాధమ్మ, నిర్మల్ ల జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం ప్రారంభించారు. వారం రోజుల పాటు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన వారికి […]

Continue Reading

హరితహారం తో సమృద్ధిగా వర్షాలు_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల విస్తీర్ణం పెరిగి సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం లో భాగంగా చివరి రోజైన శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం […]

Continue Reading

గీతంలో ఘనంగా విజేతల దినోత్సవం – విద్యార్థులకు నియామక పత్రాల అందజేత

పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్, స్కూల్ ఆఫ్ ఫార్మశీ, స్కూల్ ఆఫ్ సైన్స్ లు శుక్రవారం సంయుక్తంగా విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డే) ఘనంగా నిర్వహించాయి. ప్రాంగణ నియామకాలలో ఎంపికైన ఇంజనీ లింగ్, మేనేజ్ మెంట్, ఫార్మశీ, సైన్స్ విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశాయి. 2020-21 విద్యా సంవత్సరంలో దాదాపు 165 దేశీయ, బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్ గీతమ్ లో ప్రాంగణ […]

Continue Reading

పేద కుటుంబ ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించిన దేవేందర్ రాజు

పటాన్ చెరు పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తన వంతు సాయంగా ఆర్థిక సాయం అందచేసేందుకు యండిఆర్ ఫౌండేషన్ ముందుటుందని ఫౌండేషన్ ఛైర్మన్ ,పటాన్ చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు అన్నారు.సామాజిక సేవా కార్యక్రమాలతో భాగంగా పేద ప్రజలకు అండగా ఎండీఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. నిరుపేద కుటుంబం ఇంటి నిర్మాణం కోసంపదిహేను వేల ఆర్థిక సహాయం అందజేశారు. పటాన్ చెరు పట్టణంలోని చైతన్యనగర్ లో ఉంటున్న ఓ కుటుంబ ఇంటి నిర్మాణం కోసం […]

Continue Reading

వారం రోజుల్లో మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని నోవాపాన్ చౌరస్తా, పాత మార్కెట్, శ్రీ రామ్ నగర్ కాలనీల పరిధిలో జాతీయ రహదారి పై గల మురుగు నీటి సమస్యను వారం రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారుల కు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశించారు. జిహెచ్ఎంసి, జాతీయ రహదారుల సంస్థ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, స్థానిక కార్పొరేటర్ పెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఆయన స్వయంగా సమస్యలను పరిశీలించారు. వర్షాకాలంలో మురుగు నీటితోపాటు […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని సాయి ప్రియా కాలనీలో బుధవారం ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం భానురు గ్రామ పరిధిలో ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు […]

Continue Reading

డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయ వాది

మియపూర్ డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయ వాది అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ x రోడ్, మియపూర్ బిజెపి కార్యాలయం వద్ద జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ డా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు అధ్యక్షతన జరిగిన జయంతి కార్యక్రమంలో ఆయన చిత్ర పట్టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. […]

Continue Reading