ప్రారంభానికి నోచుకోని పటాన్ చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్ చెరు పారిశ్రామిక వాడలో 300 కోట్ల రూపాయలతో ఎంతో ఆర్భాటంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభోత్సవం పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తు పటాన్ చెరు పట్టణంలో గత నాలుగున్నర సంవత్సరాల క్రితం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన చేసి భవనం పూర్తయి సంవత్సరం పైన అవుతున్న, భవనoతో పాటు పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తెప్పించడం జరిగిందన్నారు. ఈ హాస్పిటల్ పూర్తయిన ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోకపోవడం దారుణమన్నారు. పటాన్ చెరు అంటేనే మినీ భారతదేశం లాంటిదని, పొట్ట చేత పట్టుకొని కొన్ని లక్షల మంది చుట్టుపక్కల పరిశ్రమలలో పనిచేసుకుంటూ బ్రతుకుతున్నారన్నారు. హాస్పిటల్ ప్రారంభం కాకపోవడం వలన ప్రజలు అనారోగ్యంతో ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోల్సిన పరిస్థితి ఉందన్నారు. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో వేలాది పరిశ్రమలలో అనేక ప్రమాదాలు జరుగుతుంటాయని, సిగచి పరిశ్రమలో ప్రమాదం జరిగి 54 మంది చనిపోయిన విషయం తెలిసిందేన్నారు. పరిశ్రమల లో ప్రమాదలు జరిగిన వెంటనే కార్మికులకు వైద్య చికిత్స అందుతేనె ప్రాణాలు నిలబడతాయని, కానీ ఈ హాస్పిటల్ ప్రారంభం కాకపోవడం వలన హైదరాబాదుకు తీసుకపోవడం ద్వారా మధ్యలోనే చాలామంది చనిపోతుంటారని వాపోయారు. అంతేగాకుండా జాతీయ రహదారి కూడా ఈ ప్రాంతం నుండి వెళుతున్నదని అనునిత్యం ప్రమాదాలు జరుగుతాయని, ప్రాణాలు కూడా పోతున్నాయని చెప్పాడు. ఇంత ప్రాముఖ్యమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి వృధాగా ఉంచడం, 300 కోట్ల రూపాయలు బూడిదలో పోసినట్టుగా ఉందన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టుగా ప్రజలందరికీ వైద్యం, ఆరోగ్యవంతమైన తెలంగాణగా అభివర్ణిస్తూన్న ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *