జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం

politics Telangana

-సీనియర్ జర్నలిస్టులు రామారావు, అశ్వక్,రమేష్, రాజశేఖర్ ఆధ్వర్యంలో అభినందన సభ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా నూతన కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులకు పటాన్ చెరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో సోమవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టులు రామారావు, ఆశ్వక్, రమేష్, రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి,మాజీ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు అబ్దుల్ బాసిత్, జిల్లా జనరల్ సెక్రెటరీ అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు పర్చ శ్రీనాథ్, జిల్లా సంయుక్త కార్యదర్శి కే శ్రీనివాస్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా జనరల్ సెక్రెటరీ బసవేశ్వర్, జిల్లా సంయుక్త కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఈసీ సభ్యులు సయ్యద్ మజీద్ అలీ, మైకోటి శ్రీనివాస్ లను నూతన కమిటీ సభ్యులను అభినందించారు.

సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ ప్రతి సమస్యలను పరిష్కరించే దిశగా సంఘం పనిచేస్తుందన్నారు. అక్రిడేషన్ల ఇళ్ల స్థలాల హెల్త్ కార్డుల సంబంధించినటువంటి అన్నిటి పైన ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీకి మనందరి సమస్యలను తెలియపరుస్తానన్నారు.

త్వరలో జర్నలిస్ట్ ల కు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ ఉంటుందన్నారు. జర్నలిస్ట్ లు సంఘటీతంగా ఉండాలన్నారు. బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వంతో పాటు సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, వృత్తి హక్కుల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తామని చెప్పారు.

ప్రతి జర్నలిస్టుకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సభ్యుల సహకారంతో సంగారెడ్డి జిల్లా కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శ కమిటీగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని పేర్కొన్నారు.సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సీనియర్ జర్నలిస్టుల రామారావు, రమేష్, అశ్వక్, రాజశేఖర్ లు సంఘ సభ్యులందరికీ సన్మానితులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు, సభ్యులు, స్థానిక జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *