మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
పటాన్‌చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సులో కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎస్ఐఆర్ ప్రక్రియ, డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గూడెం మహిపాల్ రెడ్డి, వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, మల్లేపల్లి సోమిరెడ్డి, దేవేందర్ యాదవ్‌తో పాటు కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తలు బీరాధర్ ఆంజనేయులు, షకీల్, మల్లేష్ యాదవ్, ఇమ్రాన్, పాండు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
