టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

politics Telangana

-అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన బండారు యాదగిరి

-ప్రధాన కార్యదర్శిగా అనీల్

-కోశాధికారిగా అన్వర్

-ఎలక్ట్రానిక్ విభాగం అధ్యక్షుడిగా ఆసిఫ్

-ప్రధాన కార్యదర్శిగా బసవేశ్వర్

-చిన్న మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడిగా సిద్ధిక్

-ప్రధాన కార్యదర్శిగా ఈశ్వర్ చవాన్

మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి :

టియుడబ్ల్యూజే(ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడిగా బండారు యాదగిరి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్ లో గురువారం జిల్లా మహాసభను నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ప్రధాన కార్యదర్శి రామనారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైసల్ అహ్మద్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సలీం ఇతర ముఖ్య నేతలు ఈ మహాసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బండారు యాదగిరి ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రు మాండ్ల అనిల్, ఉపాధ్యక్షులుగా శ్రీనాథ్ మతీన్,ఆర్ సత్యనారాయణ రెడ్డి,కిషోర్ , మల్లేశం,కోశాధికారిగా అన్వర్,జాయింట్ సెక్రటరీలుగా ఉల్లిగడ్డల శివకుమార్ , శ్రీనివాసరెడ్డి ,డి సుమన్, వెంకటేష్ ,ఎంఏ రవూఫ్
ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా విలాస్ విల్సన్ ,అంజయ్య ,ఉల్వల రాజు, రఫీఎన్నికయ్యారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా సంగమేశ్వర్ ,హాసిల్, శివన్న జైన్,సత్తార్ ఖాన్ ,హబీబ్ ఉద్దీన్ ,ఆర్ విజయ రాజు, బాలయ్య, శ్రీనివాస్ ,సత్యం, ఇర్షాన్, ప్రభాకర్ వెంకటేశం, మాజిద్ అలీ, మహబూబ్ ఘోరీ, ముజాహిద్, అబ్దుల్ హై లను ఎన్నుకున్నారు.జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షునిగా ఆసిఫ్, ఉపాధ్యక్షునిగా హెచ్ఎంటీవీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా బసవేశ్వర్, కోశాధికారిగా శ్రీధర్ జైన్, జాయింట్ సెక్రటరీగా భూపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. చిన్న , మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడిగా సిద్ధిక్ అహ్మద్, ప్రధాన కార్యదర్శిగా జవాన్ ఈశ్వర్, కోశాధికారిగా లక్ష్మణ్ , ఉపాధ్యక్షుడిగా నజీర్ ఎన్నికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *