హైదరాబాద్‌లో సంగీత ప్రియులకు మరపురాని సంగీత వేడుక

Hyderabad Lifestyle Telangana

టైమ్‌లెస్ విత్ సునీత ఉపద్రష్ట” కాన్సర్ట్‌ జూన్ 13న శిల్పాకల వేదిక లో

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

వేదం ఆర్ట్ ఆధ్వర్యంలో జూన్ 13న, శిల్పకళావేదిక హైదరాబాద్‌లో సంగీత ప్రియులకు మరపురాని సంగీత వేడుకగా నిలుస్తుందని సింగర్ సునీత అన్నారు .ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు కాన్సర్ట్ ప్రత్యేకతలు, సంగీత కాన్సెప్ట్, ప్రేక్షకులకు అందించబోయే అద్భుతమైన సంగీత అనుభూతి గురించి ఆమె ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ కాన్సర్ట్‌లో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్న ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణ మరియు ధనుజయ్ కూడా మీడియా సమావేశంలో పాల్గొని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, తరతరాల సంగీతాన్ని ఒకే వేదికపై ప్రేక్షకులకు అందించే ఈ ప్రత్యేక కాన్సర్ట్‌లో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. “టైమ్‌లెస్” ద్వారా స్వర్ణయుగంలోని చిరస్మరణీయ గీతాలతో పాటు నేటి ప్రేక్షకులు అభిమానించే మెలోడీలను కూడా అందించనున్నట్లు తెలిపారు.కాన్సర్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ, అమెరికా మరియు భారతదేశంలో భారీ స్థాయి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన వేదం ఆర్ట్మ్ సంస్థ హైదరాబాద్‌లో తమ ప్రతిష్టాత్మక కార్యక్రమంగా “టైమ్‌లెస్ విత్ సునీత ఉపద్రష్ట”ను తీసుకురావడం గర్వంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు సంగీత ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన స్వరాలలో ఒకరిగా సునీతకు ఉన్న ప్రత్యేక స్థానంతో ఈ అనుబంధం తమకు ఎంతో విశేషమని తెలిపారు.సంగీతం, జ్ఞాపకాలు, భావోద్వేగాలను ఒకే వేదికపైకి తీసుకురానున్న ఈ కాన్సర్ట్ హైదరాబాద్‌లో అత్యంత గుర్తుండిపోయే సంగీత సాయంత్రాలలో ఒకటిగా నిలవనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *