నియోజకవర్గ వ్యాప్తంగా భక్తి భావం పెంపొందిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్‌చెరు నియోజకవర్గంలో ఒక వైపు అభివృద్ధి మరో వైపు సొంత నిధులతో దేవాలయాలు, మసీదులు, చర్చిలు నిర్మిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావం పెంపొందిస్తున్నారు పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక విలువల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఆలయాల నిర్మాణం, పునర్నిర్మాణ కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తున్నారు.
తాజాగా జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని సింఫనీ కాలనీలో గురువారం ఉదయం శివాలయం, రామాలయం, అమ్మవారి దేవాలయాల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం బండల మల్లన్న దేవాలయం ఆవరణలో చౌడమ్మ దేవాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నూతన దేవాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు సొంత నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలలో ఆధ్యాత్మిక భావం పెంపొందించడంలో భాగంగా పటాన్‌చెరు నియోజకవర్గం వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు నిర్మిస్తూ పరమత సహనాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు పృథ్వీరాజ్, చంద్రశేఖర్, మల్లేష్ యాదవ్, సుధాకర్, విజయ్, వెంకటేష్, ధనరాజ్ గౌడ్, రాజు, నాగమల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *